- District News
- Warangal
- క్లెయిమ్స్,అభ్యంతరాల స్వీకరణకు,తుది జాబితా గడువు పెంపు
క్లెయిమ్స్,అభ్యంతరాల స్వీకరణకు,తుది జాబితా గడువు పెంపు
నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉండి నోటీసులు అందుకున్న ఓటర్లు ఈసీ సూచించిన ధ్రువపత్రాలు సమర్పించాలి.
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 10
(లోకల్ గైడ్ న్యూస్):
ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలోని ఓటర్లు నోటీసుల్లో సూచించిన తేదీల్లో తమ ధ్రువపత్రాలను సమర్పించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలోని ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ కేంద్రాలలో స్వీకరిస్తున్న ధ్రువపత్రాలు, నోటీసులు, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంపుపై అదనపు కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించి వాటి వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉండి నోటీసులు అందుకున్న ఓటర్ల నుండి ధ్రువ పత్రాలను స్వీకరించేందుకు విచారణ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విచారణ కేంద్రాల ద్వారా మ్యాపింగ్ కానీ, అనామాలీస్ జాబితాలో ఉన్న ఓటర్ల నుండి ధ్రువీకరణ పత్రాలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్లెయిమ్ లు, అభ్యంతరాల స్వీకరణకు 17.8.2026 నుండి 16.9.2026 వరకు ఉండగా 7.10. 2026 వరకు గడువును పెంచిందన్నారు. క్లేయిమ్ లు, అభ్యంతరాల విచారణ 17.8. 2026 నుండి 15.10. 2026 వరకు ఉండగా దానిని 5. 11. 2026 వరకు గడువును ఎన్నికల సంఘం పొడిగించిందన్నారు. తుది ఓటర్ల జాబితా 9. 11.2026న ఉంటుందన్నారు. కాగా నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరు కావాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నోటీసులో పేర్కొన్న ప్రదేశం, నిర్దేశిత తేదీ, సమయంలో సంబంధిత విచారణ కేంద్రానికి హాజరై ఏఈఆర్‌ఓకు ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలను సమర్పించాలని, అందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆ జాబితాలో ఉన్న ఓటర్లకు తెలియజేయాలని సూచించారు. నోటీసులు పొందిన ఓటర్లు ఎన్నికల సంఘం (ఈసిఐ ) నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు.
01-07-1987 కు ముందు జన్మించిన వారు సొంత ధ్రువీకరణ పత్రం సమర్పించాలని,అదేవిధంగా 01-07-1987నుండి 02-12-2004 మధ్య జన్మించిన వారు సొంత పత్రంతో పాటు తల్లి లేదా తండ్రిలో ఒకరి ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. 02-12-2004 తర్వాత జన్మించిన వారు సొంత పత్రంతో పాటు తల్లి మరియు తండ్రి ఇద్దరి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు. జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐ ఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్, అనామాలీస్ జాబితాలో ఉన్న 1,32,070 ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బీఎల్వోల ద్వారా
డెలివరీ చేసిన నోటీసులు 1,09,682 ఉన్నాయని, 22,388 నోటీసులు అందించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 39,996 హియరింగ్ కేంద్రాల ద్వారా ఏఈఆర్వోలు విచారణ చేశారని, మొత్తం పెండింగ్ హియరింగ్‌లు 69,686 ఉన్నాయని అదనపు కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఈఆర్వోలు డీఎస్ వెంకన్న, వెంకటేష్, హనుమకొండ ఏఈఆర్ఓ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి.శ్రీనివాస్ రావు, రావు అమరేందర్ రెడ్డి, జి.ప్రభాకర్ రెడ్డి, ఎండి.నేహాల్, ప్రవీణ్ కుమార్, సయ్యద్ ఫైజుల్లా, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2026 19:48:35
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
సామాజిక అన్యాయాలు,దోపిడీ,అణచివేతను ఎదిరించి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
