- District News
- ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
పి ఆర్ టి యు
నారాయణపేట సెప్టెంబర్ 10:
ప్రభుత్వము ఇప్పటికైనా ఉద్యోగుల,ఉపాద్యాయులు సమస్యల పరిష్కారా నికి కాలయాపన చేయరా దనీ టిఎస్ పి ఆర్ టి యు నారాయణపేట జిల్లా అధ్యక్షులు వై జనార్దన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువా రంమరికల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలబాలుర,బాలికల,ఉర్దూమీడియం,కన్మనూర్,పెద్దచింత కుంట, తీలేరు, మరికల్ పాఠశాలలో మండల అధ్యక్షులు నవీన్ కుమార్,ప్రధాన కార్యదర్శి ముస్తఫా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్ర మం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులు గా పాల్గొన్న జిల్లా అధ్యక్షులువై.జనార్దన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పి.వెంకట్ రెడ్డి మాట్లాడు తూ సమస్య ల పరిష్కారం కోసం జేఏసీ పిలుపు నిచ్చిన ప్రభుత్వం మీద నమ్మకం తో నిన్న జరిపిన చర్చలు కారణం గా వాయి ద వేయడం జరిగిందన్నా రు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఇచ్చిన మాట కు కట్టుబడి వారం రోజుల లోగా పిఆర్సి రిపోర్టు తెచ్చు కొని దానిని 51 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాల ని,పెండింగ్లో ఉన్న డీఎ లను విడుదల చేయాలని, సిపి ఎస్ విధానాన్ని రద్దు చేయా లని, హెల్త్ కార్డులు సక్రమం గా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయులు రాష్ట్ర నాయకులు ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవం తం చేస్తున్నారని అందుకు అభినందనలు తెలుపుతూ 18వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మరల ఉద్యమం కొనసాగు తుందని అన్నారు ఈ కార్య క్రమంలో జిల్లా ఉపాధ్య క్షులు యు రవికుమార్ పి ఆర్టీయు సభ్యులు రవీందర్ రెడ్డి మధుసూదన్ రామ్ రెడ్డి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి గోవర్ధన్ గౌడ్ అమ్రేష్ విజయకృష్ణ పద్మ రాంరెడ్డి శ్రీనివాస్ మమ్మద్ కాజా అంజయ్య వెంకట్ రెడ్డి పవన్ ఆయా పాఠశా లల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:13.సమావేశంలో మాట్లాడుతున్న జనార్ధన్ రెడ్డి
____________________
