చట్టాలపై అవగాహనతో హక్కుల పరిరక్షణ.

Published On
చట్టాలపై అవగాహనతో హక్కుల పరిరక్షణ.

లోకల్ గైడ్/బంట్వారం:
విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఎ. రాధిక సూచించారు. గురువారం బంట్వారం తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, ఉచిత న్యాయ సేవలు, న్యాయ సహాయం పొందే విధానాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను తెలుసుకోవడంతో పాటు వాటిని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా న్యాయ సహాయం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ టి. వెంకటేశ్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శ్రీనివాస్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బ్యూలా  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం  వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం 
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) సామాజిక అన్యాయాలు,దోపిడీ,అణచివేతను ఎదిరించి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వినాయక చవితి పండుగను నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో  జరుపుకోవాలి 
భద్రతపై అవగాహన.. చట్టాలపై చైతన్యం.* - షీ టీమ్స్‌, టి సేఫ్‌ యాప్‌, 112, 1930పై విద్యార్థులకు అవగాహన
చట్టాలపై అవగాహనతో హక్కుల పరిరక్షణ.
క్లెయిమ్స్,అభ్యంతరాల స్వీకరణకు,తుది జాబితా గడువు పెంపు
ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ