బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించిన పేరూరు వైద్యాధికారి భాస్కర్..

Published On
బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించిన పేరూరు వైద్యాధికారి భాస్కర్..

 

వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-

మండల కేంద్రంలో శ్రీరామనగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భాస్కర్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.బాలికలకు సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యతతో పాటు,ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.వైద్యాధికారి మాట్లాడుతూ..వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్, విరేచనాలు వంటి సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల నివారణ చర్యలు పాటించడం,సురక్షితమైన నీటిని తాగడం,చేతులను సబ్బుతో శుభ్రంగా ఉంచికోవాలని జాగ్రత్తలను వివరించారు.పేరూరు ఉప కేంద్రంనికి చెందిన 20 మంది గర్భిణీలను ఆరోగ్య సిబ్బంది పరిశీలించారు పరిస్థితిని సమీక్షించి అవసరమైన పరీక్షలు నిర్వహించి,తగిన సూచనలు మరియు సలహాలు అందించారు.గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం,తగు మందులు మరియు ఐరన్–ఫోలిక్ యాసిడ్ మందులు పోషకాహారం తీసుకోవడం ప్రమాద సంకేతాలను గుర్తించడం, ప్రసవం కోసం ముందస్తు ప్రణాళిక చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.గర్భిణీలు నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరూరు వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు,పాఠశాల సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...