బల్లునగర్ తండా అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు మంజూరు 

సీసీ రోడ్డుకు శంకుస్థాపన.. ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు సర్పంచ్ భూల్లి కృతజ్ఞతలు

Published On
బల్లునగర్ తండా అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు మంజూరు 

 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి):లోకల్ గైడ్, ఆగష్టు 8 : మండలంలోని వెంకట్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని బల్లునగర్ తండా అభివృద్ధికి మరో ముందడుగు పడింది. వి.బి.జి. రాంజీ ఫండ్స్ నుంచి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేయించడంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేక చొరవ చూపారని గ్రామ ప్రజాప్రతినిధులు తెలిపారు. మంజూరైన నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకట్యా తండా సర్పంచ్ బానోత్ భూల్లి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, తమ గ్రామపంచాయతీ అభివృద్ధికి అడిగిన వెంటనే స్పందించి రూ.20 లక్షల నిధులు మంజూరు చేయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
బల్లునగర్ తండాలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యం కలగడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగుతాయని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలోని మిగిలిన అభివృద్ధి పనులకు కూడా ఎమ్మెల్యే సహకారం అందించాలని కోరారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన నిధులను తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సర్పంచ్ భూల్లి తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ బానోత్ దేవ్లా నాయక్, ఉప సర్పంచ్ బానోత్ రమేష్, మాజీ సర్పంచ్ వాంకుడోత్ కృష్ణ, వెంకట్రాం గణేష్, గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో తండాలో అభివృద్ధి పనులు వేగవంతం కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News