- District News
- పచ్చదనం కోసం ఎంపీకి ఎమ్మెల్యే వినతి
పచ్చదనం కోసం ఎంపీకి ఎమ్మెల్యే వినతి
ఉప్పల్ నియోజకవర్గంలో నాటిన మొక్కల సంరక్షణకు 30 వేల ట్రీగార్డులు అవసరమని, ఇందుకు రూ.60 లక్షల సీఎస్‌ఆర్ నిధులు సమకూర్చాలని కోరుతూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో విస్తృతంగా చేపడుతున్న హరిత కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటుతున్నామని, వాటి సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈసీఐఎల్ సంస్థకు సీఎస్‌ఆర్ కింద ట్రీగార్డులు లేదా ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదన సమర్పించినట్లు పేర్కొన్నారు. మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు తగిన రక్షణ కల్పిస్తే నియోజకవర్గంలో పచ్చదనం మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్‌ఎస్ నాయకుడు నాగారం బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
