- District News
- కోటకొండలోపండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠా పన కోసం భూమి పూజ
కోటకొండలోపండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠా పన కోసం భూమి పూజ
అందరి వాడు పండుగ సాయన్న...వక్తలు
నారాయణపేట ఆగస్టు 8:
నారాయణ పేట జిల్లా మండలం కోటకొండ గ్రామంలో మత్స్యకార సంఘం గ్రామ అధ్యక్షులు ఎదురింటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద చెరువు దగ్గర బహుజన నాయకు డు పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాటు కోసం శనివారం భూమి పూజనిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతి ధులు మాట్లాడుతూ పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంత ర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగినవాదన్నారు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి. 35- 38 ఏళ్ల వయసులో చంప బడినాడనీ, దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్ గా ప్రజలను దోసుకుంటున్న దొరల, దేశముక్ ల, అధి కారుల, సంపన్నుల ఆస్తు లను తీసుకొని, ఇవ్వకపోతే దోచుకుని పేదలకు పంచి పంచి పెట్టీ ప్రజల మనిషిగా ఎదిగాడన్నారు. పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను, అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడన్నారు. కానీ ఆధిప త్య శక్తులైన దేశముక్ లు, కరణంపటేళ్లు, భూస్వాము లు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించా రన్నారు. పండుగ సాయన్న కథను నేటికీ వింటుం టుంటామని ఆయన అంద రికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహాలు ప్రతి ఊరిలో ఉండాలన్నారు.కార్యక్రమంలో మత్స్యకార సంఘం అధ్యక్షులు ఎదురెంటీ శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ వెంకట్రామ్ గౌడ్,ఉప సర్పంచ్ చెన్నప్ప యాదవ్,బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేపురి రాములు, బీజేపీ మాజీ ఎంపీటీసీ కెంచే శ్రీనివాసు లు, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బి యాదగిరి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభంజన్ రావు, ఎడ్ల రాజు, వార్డ్ మెంబర్స్ కావలి నరసింహులు, పేరపల్ల రఫీ, భగవాన్ శంకర్, పండుగ ఆయన్నా అభిమానులు చుక్క గోవిందు, కావాలి వెంకటేష్,చర్లపల్లి ఆంజనేయులు ఎడ్ల కుర్మయ్య పెద్ద ఎత్తున యువకులు ప్రజలు పాల్గొన్నారు .
ఫోటో రైట్ అప్:4.పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన నాయకులు
_____________________
