పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ ప్రధాన లక్ష్యం. 

అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదు – అర్హత లేని వారి పేర్లు జాబితాలో ఉండకూడదు

ఎన్యుమరేషన్ ఫారాల కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి
Published On
పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ ప్రధాన లక్ష్యం. 

 

 

 

 రంగారెడ్డి జిల్లా బ్యూరో,  (లోకల్ గైడ్ ):                       ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్ –2026) కార్యక్రమం ద్వారా పారదర్శకమైన, ఖచ్చితమైన, తప్పులులేని ఓటరు జాబితాను రూపొందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు.

ఎస్ ఐ ఆర్ –2026 కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఎన్యుమరేషన్ ఫారాల కరెక్షన్, డిజిటలైజేషన్, సవరించిన ఎన్నికల షెడ్యూల్ తదితర అంశాలపై శనివారం రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25, 2026 నుంచి ఆగస్టు 10, 2026 వరకు బూత్ స్థాయి అధికారులు (బి ఎల్ ఓ ) ఇంటింటి సందర్శనలు నిర్వహించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. ఆగస్టు 10న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ, ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాల పరిష్కారం చేపట్టనున్నట్లు వివరించారు. అనంతరం అక్టోబర్ 19, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలకు సంబంధించి ఎన్నికల సంఘం బి ఎల్ ఓ లకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకు వచ్చినందున, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు ముందే ఓటర్ల వివరాల్లో అవసరమైన సవరణలను పూర్తిస్థాయిలో చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకూడదన్నారు. అదే సమయంలో అర్హత లేని వ్యక్తుల పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండకూడదు. ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా, ఎలాంటి తప్పులకు తావు లేకుండా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం” అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో ఎన్యుమరేషన్ ఫారాల కరెక్షన్, డిజిటలైజేషన్ తదితర ప్రక్రియలను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కు నాలుగు అంశాలపై పరిశీలన. 

ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య, భౌగోళిక పరిస్థితులు, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణన లోకి తీసుకుని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా పోలింగ్ కేంద్రాల పేరు మార్పు, స్థల మార్పు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల విలీనం అనే నాలుగు అంశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండే ప్రత్యామ్నాయ భవనం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల స్థల మార్పుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా, నిర్దేశిత పరిమితికి మించి ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పరిశీలన చేస్తున్నామని చెప్పారు. గతంలో 1,400 మంది ఓటర్ల పరిమితి ఉండగా, ప్రస్తుతం అది 1,200కు తగ్గిన నేపథ్యంలో సంబంధిత నిబంధనల ప్రకారం కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తగినంత ఓటర్ల సంఖ్య లేని పోలింగ్ కేంద్రాలను సమీపంలోని ఇతర పోలింగ్ కేంద్రాలతో విలీనం చేసే ప్రతిపాదనలను కూడా నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు పరిశీలన

పట్టణ ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో నివసించే ఓటర్లకు పోలింగ్ రోజున మరింత సౌకర్యం కల్పించేందుకు గేటెడ్ కమ్యూనిటీ లకు సమీపంలో లేదా నిబంధనలకు అనుగుణంగా ఆయా కమ్యూనిటీ లలోనే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. ఒకే ప్రాంతంలో రెండు లేదా మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్న సందర్భాల్లో ఓటర్లకు మరింత చేరువగా, సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు సమయంలో కూడా సంబంధిత వివరాలు, సమగ్రంగా పరిశీలించి, నిర్ధారణ అనంతరం మాత్రమే పేర్లను తొలగించాలని కోరారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు చేసిన సూచనలను పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఎస్ ఐ ఆర్ –2026 ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బి ఎల్ ఓ లు , ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేసి పారదర్శకమైన, విశ్వసనీయమైన, తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

ఈ సమావేశంలో ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, ఈఆర్‌ఓలు సరిత, పార్థసింహా రెడ్డి, జనార్ధన్ రెడ్డి, డిఆర్ఓ శారద దేవి, ఎన్నికల విభాగం అధికారి రవీంద్ర గుప్తా, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరీ సతీష్, బి ఆర్ ఎస్ నాయకులు  సత్తు వెంకట్ రమణ రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బాబు లాల్, బిజెపి నాయకులు ఎన్. మల్లారెడ్డి, ఎస్. విజయ్ కుమార్,  బి.ఎస్.పి నాయకులు బి. అనంత రాములు, అదిరాల రవి కుమార్, ఎంఐఎం పార్టీ నాయకులు  మహమ్మద్ తాహెర్, సిపిఐ నాయకులు  కే. నరసింహారెడ్డి, జే. ఆనంద్ గౌడ్, విజయానందన్, జే. సదానందం, జి. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న డా.రసమయి బాలకిషన్‌కు ఘన స్వాగతం అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న డా.రసమయి బాలకిషన్‌కు ఘన స్వాగతం
బెజ్జంకి ఆగస్ట్ 8 (లోకల్ గైడ్): అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత డా. రసమయి బాలకిషన్‌కు...
విద్య, పరిశోధన, ఆవిష్కరణలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం
రైతుల సాగునీటి కష్టాలకు చెక్‌.. ప్రాజెక్టులపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టి
పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ ప్రధాన లక్ష్యం. 
ఉపసర్పంచ్‌పై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలి
'సర్ 'కు నావంతు బాధ్యత వహించాను 
అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన  బడే హర్షిత..