వంగూరి వాచకం- నవరత్నాలు 

Published On
వంగూరి వాచకం- నవరత్నాలు 

 

ఆగస్టు 8( లోకల్ గైడ్ ):

1. ఎదుటివారిలో లేనిదాన్ని 
మరీ మరీ ప్రస్తావించదవేల
ఎన్నో ఉండి ఉంటాయి కదా 
వాటినెందుకు ప్రశంసించవు.

2.తడబడితే 
విరుస్తావు పెదవి 
తెగబడితేనే 
వరిస్తుంది పదవి.

3.అడుగు కదలాలి 
నడకకు 
తలుపు వేయాలి 
బలుపుకు.

4 . కొందరు 
కారణ జన్ములు
మరికొందరు 
రణ జన్ములు.

5.చిరుకోపం 
ఒక మంచి ఆభరణం 
పెనుకోపం 
కొంపముంచు కారణం.

6.ఉంటేనే సరిపోదు 
ప్రణయం 
తింటేనేగా నిలిచేది 
ప్రాణం.

7.నిలకడ లేని 
పసిడి 
అలజడిలో 
మనిషి.

8.అందం,ఐశ్వర్యం మాత్రమే 
ఆనందానికి కాదుగా ముద్ర 
అందరికీ ఒకే విధమైన
ఆనందాన్నిస్తుందిగా గాఢ నిద్ర.

9.అందరికీ ఆదిత్యుడే
ఫ్రీగా అందించేవాడు నాడు 
కొనేది తినేది మనమే 
డీ విటమిన్ బిల్లలు నేడు.

 వంగూరి గంగిరెడ్డి 
9652286270
షాద్ నగర్

Tags:

About The Author

Latest News

గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి* కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
కల్లుగీత కార్మికుల సుదీర్ఘ పోరాటాల ఫలితమే పాపన్న విగ్రహ ఆవిష్కరణ
వెల్కటూరులో ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమం
వీరభద్ర స్వామి, పోచమ్మ తల్లి ఆశీస్సులతో ..!    
ఖమ్మంలో రైతు కూలీల జాతీయ మహాసభలకు సన్నాహాలు
వృద్ధుల పట్ల గౌరవం – సమాజ ప్రగతికి ప్రతీక
22ఏ నిషేధిత భూములపై సమగ్ర విచారణ జరపాలి