- District News
- _కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ పోరుబాట
_కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ పోరుబాట
_హామీల అమలులో జాప్యంపై డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం
కుత్బుల్లాపూర్నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన గళం వినిపించారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని పేర్కొంటూ కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుఆదేశాలమేరకునిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హామీలను త్వరితగతిన అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు జాలిగాం రాకేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో 131వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు సోమేష్ యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు కిషోర్ చారి, సతి రెడ్డి, దుర్గా రెడ్డి, రమణ రెడ్డి, వెంకట్, నసీర్, బాంబే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీల సాధన కోసం అవసరమైతే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
