- District News
- Warangal
- కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత..
కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత..
నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే
(లోకల్ గైడ్ న్యూస్):
పేదల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.హనుమాకొండ,
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం సుమారు రూ.1 కొటి.19 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ 4వ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేపట్టిన పనులకు కాలపరిమితిని నిర్దేశించి నెల రోజుల్లోగా పనులను పూర్తి చేసే విధంగా అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.జ్యోతిబాస్ నగర్ కాలనీలో ఇప్పటికే ప్రధాన రహదారులు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మిగిలి ఉన్న మరో రెండు చిన్న గల్లీల్లో కూడా ఈ నెలలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థ తదితర అంశాల్లో ఎక్కడా సమస్యలు లేకుండా సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మౌలిక వసతుల కల్పన తో పాటు సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పేదలు, స్లమ్ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు.ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడం తో పాటు తమ సమస్యలను నిర్భయంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాయిని పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
కాలనీ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి, వారికి మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం అభివృద్ధిలో కీలక భాగమని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి కాలనీని దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమకొండ రాజేందర్,బాషాబోయిన కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, నాయకులు అంబేద్కర్ రాజు,మాజీ కార్పొరేటర్ బొడ డిన్న, అధికారులు, నాయకులు , కార్యకర్తలు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
