పాముకాటుతో మహిళ మృతి.

మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి

నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం జనగాం వచ్చిన కుటుంబం - కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్
Published On
పాముకాటుతో మహిళ మృతి.

లోకల్ గైడ్/తాండూర్:

  • పాముకాటుతో ఓ మహిళ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు తన భర్త, పిల్లలతో కలిసి నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసం జనగాం గ్రామానికి వచ్చింది. అప్పటి నుంచి గ్రామ శివారులో మొహినుద్దీన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో లేబర్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు.
    ఈ నెల 23న అర్ధరాత్రి 2 గంటల సమయంలో లేబర్ రూమ్‌లో నిద్రిస్తున్న మహిళను గుర్తుతెలియని పాము కాటువేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
    మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు