- District News
- Ranga Reddy
- శిథిలావస్థలో బైరంపల్లి ప్రభుత్వ పాఠశాల భవనం..
శిథిలావస్థలో బైరంపల్లి ప్రభుత్వ పాఠశాల భవనం..
పేద విద్యార్థుల గుడి అదే సర్కారు బడి... విద్యార్థుల జీవితాలకు వెలుగు రేఖల కాంతి నిలయాలు. ప్రభుత్వ పాఠశాలలు...
గత పది సంవత్సరాలుగా నిరుపయోగంగా .నిరాధరణగా.*
సర్కారు బడికి సహాయం ఎప్పుడని నూతన భవనం నిర్మించాలని పేద విద్యార్థుల పదేళ్ల ఎదురుచూపులు..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ 07 కొందుర్గ్..
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని.బైరంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.పరిస్థితి చాలా దారుణంగా.తయారైంది గడిచిన పది సంవత్సరాల నుండి శిథిలావస్థకు చేరుకున్న. ఏ ఒక్కరు కూడా పట్టించు కోలేదు.. ప్రభుత్వ భవనం ను వెంటనే పునర్నిర్మించి గ్రామీణ ప్రాంత పేద పెద్యార్థులకు పూర్తి సౌకర్యాలతో నిర్మిస్తామన్నా గత ప్రభుత్వం మాట ఉత్త నీటి మూటలే అయ్యాయి ప్రస్తుత ప్రభుత్వం కొలువు దీరి రెండున్నర ఏళ్ళైనా ప్రజా ప్రభుత్వం నేటికి సైతం పాఠశాల వైపు కన్నెత్తి చూడక పోవటం దాని బాగోగుల గురించి ఆలోచించక పోవటం చాలా.బాధాకరం గ్రామంలో చాలా మంది పేద ప్రజలు కూలి పనులు చేసుకుంటూ వారి జీవన విధానం సాగిస్తున్నారు వారి పిల్లలని ప్రభుత్వం పాఠశాలలో చదివించాలని ఉన్న సరైన పాఠశాల వసతుల లేక పోవటం వల్ల అప్పల పాలవుతూ సమీప ప్రాంతంలోని ప్రైవేటు బడులకు పంపించాల్సి వస్తుందంటున్నారు గ్రామ ప్రజలు...
గ్రామంలో పాఠశాలకు రెండు వేరు వేరు భవనాలున్నాయి అందులో ఒక్కటి గడచిన పది సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉండగా మరొకటి ఒక హాళ్లు మాత్రమే ఉపయోగంలో ఉంది ప్రస్తుతం పిల్లలు చదువుతున్న పాఠశాల భవనంలో ఒక చిన్న హాళ్లు దానికి అనుబంధంగా.ఒక ఆఫీసు రూం ఉంది దానిలో మళ్ళీ ఇతర వస్తు సామాగ్రి కి పొగ మరల ప్రభుత్వం గ్రామాలకు అందించే ఇంటర్ నెట్ కన్నేషన్ సామాగ్రి కూడాను అందులో ఉంచారు .. ఒక్క హాల్లో ఐదు తరగతుల చదువులు. విద్యార్థుల రోజువారి కష్టాలు అన్నీ ఇన్ని కాదు.. పాఠశాలలో చదువు మాత్రమే చక్కగా ఉన్న సౌకర్యాలకు మాత్రం శూన్యం.విద్యార్థులు టాయిలెట్స్ బాత్ రూంలో కూడా లేవు విద్యార్థులు కాలకృత్యాలకు ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు గ్రామీణ పేద విద్యార్గులకు.చక్కటి వసతులతో నాణ్యమైన ప్రభుత్వ విద్య అంటున్న ఈ గ్రామంలో మాత్రం అందుకు పరిస్థితులు. చాలా బిన్నంగా ఉన్నాయి గత ప్రభుత్వం లో ఈ పాటశాల.పూర్తి నిరాదరణకు గురైంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా రెండున్నర ఏలైన నూతన పాఠశాల భవనం జాడేలేదు.. విద్యార్థులు మా కోసం ఎవరైనా సహాయంగా రారా అని చాలా దీనంగా. ప్రతిరోజూ ఎదురు చేస్తుంటారు... పేద విద్యార్థుల.గుడి అదే మన బైరంపల్లి ప్రభుత్వ పాఠశాల బడి .. నేటికైన సంబంధిత అధికారులు ప్రజా పాలకులు.వెంటనే చర్యలు చేపట్టి.పూర్తి సౌర్యాలతో నూతన పాఠశాల భవనం నిర్మించాలని గ్రామీన పేద విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించాలని గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లి దండ్రులు కృత్ఞులుగా కోరుతున్నారు...
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 15:23:36
కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 7, లోకల్ గైడ్ న్యూస్ : బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జిల్లా
