- District News
- ఘనంగా నూతన టీ, కాఫీ షాప్ ప్రారంభోత్సవం
ఘనంగా నూతన టీ, కాఫీ షాప్ ప్రారంభోత్సవం
గ్రామాల్లో యువత స్వయం ఉపాధి సాధించడం అభినందనీయం: సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండా గ్రామపంచాయతీ పరిధిలో
స్థానిక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ మరియు కాఫీ షాప్‌ను గ్రామపంచాయతీ సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో యువత ఇలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన టీ, కాఫీలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. గ్రామంలో వ్యాపారం విజయవంతమై మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షిస్తూ, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి . ప్రోప్రేటర్ అడిదల ఆశదేవితో కలిసి పూజ కార్యక్రమంలొ పాల్గొని భక్తిశ్రద్ధలతో దేవుని పూజించి ....... ఆ దేవుణ్ణి ఆశీస్సులతో ఆశదేవి "టీ హబ్ " షాప్ మంచిగా సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు... ఉప సర్పంచ్ గుంజ వీరస్వామి వార్డు సభ్యులు కండ్రాతి యాకేష్, మక్కల దుర్గారావు మరియు దేరంగుల సమ్మయ్య, షేక్ సైదులు, గుర్రం సాయి తదితరులు పాల్గొన్నారు.
