- District News
- Ranga Reddy
- మేడిగడ్డ తాండకు ప్రభుత్వ భూమి కోసం ప్రజావాణిలో గళం
మేడిగడ్డ తాండకు ప్రభుత్వ భూమి కోసం ప్రజావాణిలో గళం
ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి భూమి గుర్తించాలని ప్రజావాణిలో వినతి
లోకల్ గైడ్
ఆమనగల్లు, సెప్టెంబర్ 7:
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం
మేడిగడ్డ తాండ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా అవసరాల కోసం భవనాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మేడిగడ్డ తాండ ఉప సర్పంచ్ విజయ్ రాథోడ్ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఆమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జైరాం విజయ్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ తాండ గ్రామపంచాయతీ పరిధిలో మహిళా సంఘం భవనం, అంగన్‌వాడీ కేంద్రం, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో పాటు భవిష్యత్తులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రస్తుతం సరైన స్థలం అందుబాటులో లేదని తెలిపారు.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మేడిగడ్డ తాండ శివారు పరిధిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి గ్రామపంచాయతీకి కేటాయించాలని కోరారు. ముఖ్యంగా సర్వే నంబర్ 556లో 3.0300 గుంటల భూమి, సర్వే నంబర్ 591లో 2.0100 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన భవనాల నిర్మాణానికి కేటాయించాలని ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు.
గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సేవా కేంద్రాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వ సేవలను పొందేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దేవేందర్, సీతారాం, జయందర్, కవిత మణిపాల్, సితి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
