ఆర్ గ్యారంటీలను అమలు చేయాలి.

420 హామీలను వెంటనే పరిష్కరించాలి.

సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు టిఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతి.
Published On
ఆర్ గ్యారంటీలను అమలు చేయాలి.

 



 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్. 

 

 

 కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై సోమవారం ఆరవ రోజు బీఆర్ఎస్ నల్గొండ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో సుమారు 100మందికి పైగా పార్టీ  ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు జరపాలని. 420 హామీలను పరిష్కరించాలని... వెయ్యి రోజుల పాలన ముగిసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందని..  వెంటనే అన్ని హామీలను అమలు చేయాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు..అంతకు ముందు కలెక్టర్ కార్యాలయం ముందు.. అసంబ్లీ ముందు  బిఆర్ఎస్ ఎమ్మెల్యే లను పోలీసులు అడ్డుకోవడం.. హరీష్ రావు పై,మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పై పోలీసుల దాష్టికం పై పెద్ద ఎత్తున.. నిరసన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో
ఏఎంసి మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి,రెగట్టే మల్లిఖార్జున రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,  అభిమన్యు శ్రీనివాస్ మైనం శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మారగోని గణేష్ బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్,దొడ్డి రమేష్  పెరిక యాదయ్య పేర్ల అశోక్ రత్నగిరి శ్రీనివాస్ కుందూరి ప్రవీణ్ రెడ్డి మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న,  రావుల శ్రీనివాసరెడ్డి, పల్లె రంజిత్, పిన్నపు రెడ్డి మధుసూదన్ రెడ్డి గంజి రాజేందర్,మాతంగి అమర్ పెరిక కరణ్ జయరాజ్, దండంపెల్లి సత్తయ్య, రాపోలు వెంకటేశ్వర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నార.

Tags:

About The Author

Latest News