- District News
- జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి
జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తహసిల్దార్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సోమవారము వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి తహసిల్దర్లతో జూమ్ సమావేశము నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగినదని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జనగణనలో విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. నిర్ణీత మార్గదర్శకాలు, గడువులను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎక్కడా జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా ప్రతి దశను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
మ్యాపింగ్ లేని ఓటర్లు, వివిధ రకాల అనామలీస్ గుర్తించిన ఓటర్లకు సంబంధించి నోటీసులు తప్పనిసరిగా జనరేట్ చేసి, సంబంధిత ఓటర్లకు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తగిన సమయం కల్పించి విచారణ నిర్వహించాలని సూచించారు.
జిల్లాలోని 22A భూముల వివరాలు, పెండింగ్ దరఖాస్తులు, రికార్డుల పరిశీలన తదితర అంశాలపై తహసీల్దార్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.22A భూములకు సంబంధించి ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని తహసీల్దార్లకు కలెక్టర్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సమావేశములో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి,జాడ్ పి సి ఇ ఓ సుదీర్, ఆర్ డి ఓ వాసుచంద్ర, సిపి ఓ వెంకటేశ్వర్లు, డి పి ఓ జయసుధ, ఇ సెక్షన్ సుపరింతెన్దేంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
