సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్

సీజనల్ వ్యాధుల నివారణకు పంచాయతీ ప్రత్యేక చర్యలు.. దోమల బెడద అరికట్టేందుకు ఫాగ్గింగ్

Published On
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్):

కారేపల్లి మండలం గేట్ కారేపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు పంచాయతీ ఆధ్వర్యంలో ఫాగ్గింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ పూసం ఎల్లయ్య, ఉప సర్పంచ్ కందుల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కె. అనూష ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులు, నివాస ప్రాంతాల్లో ఫాగ్గింగ్ చేపట్టారు. వర్షాకాలంలో దోమల వృద్ధి అధికమై డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఫాగ్గింగ్ నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దోమల నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ అధికారులు సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిరంతరం చర్యలు కొనసాగిస్తామని సర్పంచ్ పూసం ఎల్లయ్య తెలిపారు.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...