- District News
- Ranga Reddy
- ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......
ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......
ఒకవైపు ప్రభుత్వం చెరువులను సుందరీకరిస్తుంటే... ఆ చెరువులకు నీరు రాకుండా కాలువలను కబ్జాచేస్తూన వైనం..
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్7 ( లోకల్ గైడ్ )
ఫిరంగి నాలా పై అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను ఇరిగేషన్ అధికారులు వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బక్కని నర్సింహులు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల ఫిరంగి కాలువపై అక్రమంగా నిర్మిస్తున్న కార్పొరేట్ పాఠశాల భవనాన్ని సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు తెలుగుదేశం నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం రాజరికపాలనలో ఫ్రెంచ్ ఇంజినీరింగ్ నైపుణ్యంతో రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం, చందనవెళ్లి గ్రామ శివారులో 1872 లో కత్వ నిర్మించి అక్కడి నుండి ఫిరంగి కాలువను ఎంటేరు వాగుతో అనుసంధానం చేసి అక్కడ నందులకత్వ నిర్మించి ప్రతి వాన చుక్కను పరిరక్షించి గొలుసు చెరువులకందించాలని దాదాపు 104 కి.మీ.ల గ్రావిటీ ద్వారా పారుతుండె. ఈ వరద కాల్వకు ఆనాడే 100 క్యూసెక్కుల నికర జలాలను కేటాయించారు. 45 చెరువులను, మరెన్నో కుంటలను నింపి 28 గ్రామ పంచాయతీల్లోని 100 చిన్న గ్రామాలకు పీడర్ -కెనాల్ గా సాగు, తాగు నీళ్లందించేంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920 నాటికి ఈసీ, మూసీ నదులపై హైదరాబాద్ కు వరద ప్రమాదాన్ని నివారించడానికి నగర ప్రజలకు మంచినీరందించే లక్ష్యంతో హిమాయత్సాగర్, (చేడమ్మ-చెరువు) ఉస్మాన్సాగర్ (గండిపేట చెరువు) లను నిర్మించారు. ఇలాంటి చారిత్రాత్మక ఫిరంగిణాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కోత వేటు దూరంలో అక్రమంగా కార్పొరేట్ విద్య సంస్థలను నిర్మిస్తున్న అధికారులు సోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి ఫిరంగి నాలా కబ్జాలను అరికట్టకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడే టెంట్ వేసుకొని ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ కృష్ణమాచారి, ఆదిభట్ల మున్సిపల్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ప్రెసిడెంట్ రామ్ రెడ్డి, మంచాల మండల్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రామ్ రెడ్డి, ఆనంద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
