దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను ఖండించిన  తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కిషోర్

Published On
దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,

,

 

తల్లాడ, సెప్టెంబర్,7: లోకల్ గైడ్:

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన  వ్యాఖ్యలపై తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కిషోర్   తీవ్రంగా స్పందించారు. దళిత నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అన్నారు,*

.
*ఈ సందర్భంగా  వారు   మాట్లాడుతూ.. “దళితులంటే ఎమ్మెల్సీ తాతా మధుకు ఎందుకంత చులకన? పదవిలో ఉన్నామనే అహంకారంతో మాట్లాడటం సరికాదు. దళిత సమాజాన్ని అవమానించే విధంగా ఎవరైనా మాట్లాడితే ప్రజాస్వామ్య పద్ధతిలో తీవ్రంగా వ్యతిరేకిస్తాం” అని అన్నారు,*

 దళితులు, బహుజనుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని వారు సూచించారు. “పదవులు శాశ్వతం కాదు.. ప్రజల గౌరవం, రాజ్యాంగ విలువలే శాశ్వతం” అని పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై మాట్లాడాలని ఆయన అన్నారు.*డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన గౌరవం కల్పించిందని*
,ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.
“దళిత నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  దళిత, బహుజన వర్గాలు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేస్తాయి. ఇకనైనా తాతా మధు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి” అని  కిషోర్   డిమాండ్ చేశారు.
దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలను సహించబోమని, అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కిషోర్ స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.
పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సట్టు సైదులు.
జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి 
గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        
ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......