రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.

రాష్ట్ర రోడ్జు భవనాల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. --- యువత మారక ద్యవ్యాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు శ్రద్ద తీసుకోవాలి.  -- అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. 

పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చాం.. ---- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.. కర్కేతండా లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన  రాష్ట్ర  మంత్రులు. 
Published On
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 24:

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలే కాకుండా, అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని   రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం రూ: 87.53 కోట్ల నిధులతో  నిర్మించిన కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర  మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ప్రారంభించారు.IMG-20260824-WA0268ఈ సందర్భంగా  మంత్రి కోమటిరెడ్డి  మాట్లాడుతూ  రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలనే కాకుండా, ఇంకా అదనంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. వనపర్తి జిల్లాలో సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌నునిర్మించడం జరిగింధన్నారు. రూ.87.53 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 18 తండాల పరిధిలో మొత్తం 4,235 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతాయన్నారు. ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేయడంతో పాటు చెప్పని అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సుమారు రూ.36 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

  ----- ప్రాజెక్ట్‌కు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ పేరు పెట్టేందుకు చర్యలు...

 కర్నే తాండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి జిల్లాలో 3384 ఎకరాలకు,  నాగర్ కర్నూల్  జిల్లాలో 851 ఎకరాలు కలిపి మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ప్రాజెక్టు పేరును గిరిజనుల  ఇష్టదైవం అయిన  శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్  లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ఇదే కాకుండా పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. 

---- యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: -------- మంత్రి జూపల్లి కృష్ణారావు 
 గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. సంవత్సరానికి రూ.60 వేల కోట్ల రూపాయలు వడ్డి కింద చెల్లించాల్సి వస్తుందన్నారు. అయినప్పటికీ ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.


---- నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ...
 
మాట్లాడుతూ.. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి జిల్లాలో 3,384 ఎకరాలకు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 851 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.87.53 కోట్లు ఖర్చు చేశామని, 245 ఎకరాల భూసేకరణ కూడా చేపట్టామని వివరించారు. గత పాలకులు అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని ప్రజలను మభ్యపెట్టారని, అయితే వాస్తవంగా పెండింగ్‌లో ఉన్న పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు. మిగిలిన బ్యాలెన్స్ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కర్నె తండా పరిధిలోని తండాలకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఎంపీ వివరించారు. రాష్ట్రం లో 3.35 కోట్ల మందికి సన్న బియ్యం, 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 70 వేల ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు.ఈ ప్రాంతంలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు.

---- పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చాం:

---   ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి...


వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.87 కోట్లతో జీఓ తీసుకువచ్చినప్పటికీ, సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేసి పనులను మధ్యలోనే నిలిపివేశారని, మిగిలిన 40 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేసి పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పెండింగ్‌లో ఉన్న పనులను సుమారు రూ.29 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందని మిగిలిన 11 కోట్లు భూసేకరణ,  ఇతరత్రా పెండింగ్ పనులకు ఖర్చు చేసి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రూ.2,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

---- సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత: 

--- నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.
 
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో మార్కండేయ ప్రాజెక్ట్‌తో పాటు కర్నె తండా వంటి సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేసుకున్నామని తెలిపారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తి చేయడంపై దృష్టి సారించిందన్నారు. కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంత్ సేవాలాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన చర్యలు చేపడతామని తెలిపారు.
కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుప డటంతో పాటు వ్యవసాయాభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. ప్రాజెక్ట్ ద్వారా నీరు అందనున్న తండాల పరిధిలోని ఆయకట్టు భూములు సాగులోకి రావడంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుం ది. అనంతరం వనపర్తి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ తో కలిసి సర్జ్ పూల్ వద్ద ప్రారంభమైన నీటి ప్రవాహానికి పూజలు చేసి పూలు సమర్పించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...