మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

హనుమకొండ జిల్లా  కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి.
Published On
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్07
(లోకల్ గైడ్ న్యూస్)

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కోరారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ), హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో  నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి ప్రారంభించారు.ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని కోరుతూ గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను చెరువులు,కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. నీటి కాలుష్యం ద్వారా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. ప్రజలు పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా నీటి వనరులను, ప్రకృతిని కాపాడేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
వినాయక చవితి సందర్భంగా భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సహజంగా కలిసిపోయే మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పండుగను పర్యావరణహితంగా నిర్వహించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ టీజీపీసీబీ నోడల్ అధికారి బి. జీమూత వాహన,  వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

Tags:

About The Author

Latest News

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.
పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సట్టు సైదులు.
జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి 
గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        
ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......