గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        

రెండు బాక్స్ లకే అనుమతి అత్తాపూర్ పోలీసుసులు హెచ్చరికలు: 

Published On
గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        

       

రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):                                  రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాలు,  నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డిజే లకు అనుమతి లేదని అత్తాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో  డిజే డీజే సౌండ్ సిస్టమ్ యజమానులతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సమావేశంలో తెలంగాణ హైకోర్టు,  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గణేష్ ఉత్సవాల్లో శబ్ద కాలుష్యాన్ని అదుపు చేసేందుకు డిజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని స్పష్టం చేశారు.
ప్రధాన మార్గదర్శకాలు & హెచ్చరికలు:
నిబంధనల ప్రకారం ప్రార్థనా ప్రదేశాలు మరియు ఊరేగింపులలో కేవలం రెండు (2) సాధారణ సౌండ్ బాక్సులను మాత్రమే పరిమిత శబ్ద తీవ్రతతో ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
భారీ డిజే సిస్టమ్‌లు, సౌండ్ వాల్స్ వినియోగించడం చట్టరీత్యా నేరం.
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి డిజే సిస్టమ్‌లను ఏర్పాటు చేసినా లేదా శబ్ద కాలుష్యానికి పాల్పడినా సంబంధిత డిజే యజమానులు మరియు ఉత్సవ నిర్వాహకులపై చట్టరీత్యా కఠినమైన కేసులు నమోదు చేయడమే కాకుండా, సౌండ్ పరికరాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. 
ప్రజలందరూ, ఉత్సవ కమిటీ సభ్యులు,  డిజే యజమానులు పోలీసు శాఖకు సహకరించి, శాంతియుత వాతావరణంలో, నియమనిబంధనలకు లోబడి ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు.

Tags:

About The Author

Latest News

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.
పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సట్టు సైదులు.
జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి 
గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        
ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......