తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ఆచార్య జయశంకర్

గేట్ కారేపల్లిలో ఘనంగా జయంతి వేడుకలు... ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు

Published On

 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతకర్తగా, ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని గేట్ కారేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తూ, తెలంగాణ సాధనలో ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడిపూడి తిరుమలరావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం అంకితభావంతో పోరాడిన ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూసం ఎల్లయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి అనూష, భానోత్ కల్పనా, భూక్యా రమేష్, మూడు శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకూరి వెంకటేశ్వర్లు, జక్కుల కుమార్, చెరుకూరి రామారావు, సాయిన్ని సైదయ్య, గుడిపూడి రామారావు, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News