- District News
- ఆర్థోపెడిక్ మెగా ఉచిత వైద్య శిబిరం విజయ వంతం
ఆర్థోపెడిక్ మెగా ఉచిత వైద్య శిబిరం విజయ వంతం
నారాయణపేట ఆగస్టు 21:
లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320A వారి సహకారంతో నారాయణపేట యశోద కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆర్థోపెడిక్ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవం తం అయింది.ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా లయన్ కుంభం శివకుమార్ రెడ్డి , మల్టిపుల్ కాన్సిల్ మెంబర్ లయన్ డాక్టర్ హరి నారాయణ బట్టడ్,క్లబ్ అధ్యక్షుడు లయన్ రవికుమార్ గౌడ్ ,కార్యదర్శి లయన్ మోహన్ కుమార్ కోన,ట్రెజర్ లయన్ రాజేష్ పోలేపల్లి సీనియర్ సభ్యులు లయన్ శ్రీనివాస్ లాహోటి, లయన్ కృష్ణమూర్తి, లయన్ జనార్దన్, లయన్ సాయి నాథ్, లయన్ ఎస్. చక్రవర్తి గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తూ, ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామ్య మైన లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట 320 ఎ సభ్యులకు, యశోద కేర్ హాస్పిటల్ వైద్య బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఫోటో రైట్ అప్ 8.వైద్య శిబిరాన్ని ప్రారంబించిన శివకుమార్ రెడ్డి
