- District News
- నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.
నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.
సిఎంఆర్ఎఫ్ నిధులు అందజేస్తున్న ఎమ్మెల్యే.
మంచిర్యాల జిల్లా (ప్రతినిధి లోకల్ గైడ్)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్నహస్తంగా నిలుస్తోంది.అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్ కు చెందిన ఎం శివనారాయణకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు 2లక్షల50వేలు,అదేవిదంగా మియాపూర్ కు చెందిన యు సూర్య ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా చికిత్స నిమిత్తం 2 లక్షల ఎల్ఓసి ని జిల్లా డిసిసి మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ శనివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతు భారీగా వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఊరటనిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.పేద,మధ్యతరగతి కుటుంబాల్లో అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్య ఖర్చులు భరించడం పెద్ద భారంగా మారుతోందని,కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని,ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోందని సంతోషం వ్యక్తం చేసారు.ముఖ్యమంత్రి సహాయాన్ని అర్హులైన బాధిత కుటుంబాలకు అందించడంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
