సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి

డీసీపీ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో మౌనం పాటించి సంతాపం తెలిపిన పోలీసు సిబ్బంది విలేకరులు

Published On
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి

 

 

 

పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 25 (లోకల్ గైడ్)
మన ఆత్మీయ మిత్రుడు,
సోదరుడు, సుల్తానాబాద్ టీవీ9, సిటీ కేబుల్ సీనియర్ జర్నలిస్టు టికే రమేష్ బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతికి సంతాపంగా శుక్రవారం పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంక్కెన రవి, ఏసిపి గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో  సిఐలు రంజిత్ రావు, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు చంద్రకుమార్, అశోక్ రెడ్డి పోలీసు సిబ్బంది, మండల విలేకరులు మౌనం పాటించి ఘనంగానివాళులర్పించారు.ఈ సందర్భంగా రామేశ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు ఆయన మృతి జర్నలిజం రంగానికి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో రమేష్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతూ పోలీసు సిబ్బంది, విలేకరులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.