- District News
- Ranga Reddy
- శంషాబాద్ లో ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయాలనిమంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం
శంషాబాద్ లో ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయాలనిమంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం
శంషాబాద్,ప్రతినిధి సెప్టెంబర్11
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శంషాబాద్ జోన్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరుపేదలకోసం ఐదు రూపాయల భోజనం క్యాంటీన్ ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వి జైపాల్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం సిపిఐ పార్టీ శంషాబాద్ మండలం కార్యదర్శి నర్రా గిరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుగ్గిళ్ళ శ్రీధర్ బాబు ని కలసి మినిస్టర్ కోటర్స్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి కార్మికులు జీవనో ఉపాధి కోసం శంషాబాద్ కు వలస కార్మికులు వేలాదిగా నివసిస్తున్నారని వారు గుర్తుచేశారు. లేబర్ అడ్డాల దగ్గర ఉపాధి లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వేలాదిమంది కార్మికులు ఉన్నందున శంషాబాద్ లోనీ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఐదు రూపాయల భోజనాన్ని (ఇందిరమ్మ క్యాంటీన్) ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబుని కోరడం జరిగిందని పేర్కొన్నారు. తప్పకుండా శంషాబాద్ లో ఐదు రూపాయల భోజనాన్ని ఏర్పాటు చేసే విధంగా చూస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇవ్వడం జరిగింది నేతలు పేర్కొన్నారు.
