ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం

నిందితుడికి యావజ్జీవ శిక్ష

Published On
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం

 



 


పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 25 (లోకల్ గైడ్)
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితుడికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే బాధిత బాలిక కుటుంబానికి మూడు  లక్షల పరిహారం అందించేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తేదీన రాత్రి సుల్తానాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న ఆరేళ్ల బాలికను నిందితుడు బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరుసటి రోజు ఉదయం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, భౌతిక సాక్ష్యాలను సేకరించి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టు విచారణలో కీలక సాక్ష్యాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టడంతో నిందితుడిపై నేరం రుజువైంది.పెద్దపల్లి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కె. స్వప్నరాణి కేసును విచారించి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు ఇరవై ఎనిమిది వేల జరిమానా విధించారు. బాధిత బాలిక కుటుంబానికి మూడు  లక్షల పరిహారం అందించేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.పోలీసులకు ఉన్నతాధికారుల అభినందనలు పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్‌రెడ్డి పర్యవేక్షణలో, ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కేసును పకడ్బందీగా దర్యాప్తు చేశారు. సాంకేతిక, సీసీటీవీ ఆధారాలతో పాటు సాక్ష్యాలను సేకరించి, కోర్టు విచారణలో సాక్షులను ప్రవేశపెట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీనియర్ జర్నలిస్ట్ టీికే రమేష్ మృతి పట్ల డిసిపి రామ్ రెడ్డి, ఏసిపి గజ్జి కృష్ణ, పోలీస్ సిబ్బంది స్థానిక మండల విలేకరులు సంతాపం తెలిపి మౌనం పాటించారు. కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకేన రవి, సీఐ రంజిత్‌రావు, ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు చంద్రకుమార్, అశోక్‌రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.