రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.

రోడ్డు భద్రతా సామగ్రి కొనుగోలులో ప్రమాణాలు, స్పెసిఫికేషన్లు పరిశీలించాలి. ప్రతి రోడ్డు ప్రాంతంలో చేపట్టిన చర్యలకు ముందు, తర్వాత ఫొటోలతో నివేదిక సిద్ధం చేయాలి.

శ్రీశ్రీ సర్కిల్ వద్ద్ ప్రమాదాలు నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక. రోడ్డు భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
Published On
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.   ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి.  జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.

ఖమ్మం, సెప్టెంబర్- 25: లోకల్ గైడ్:

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో రోడ్డు భద్రతపై సమీక్షించారు.IMG-20260925-WA0213

జిల్లాలోని వివిధ ప్రమాదకర, సున్నితమైన రహదారి ప్రాంతాల పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతకు అవసరమైన సామగ్రి, పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఇతర జిల్లాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్లను పరిశీలించి, అక్కడ వినియోగించిన సామగ్రి స్పెసిఫికేషన్లు, ప్రమాణాలను క్రాస్‌ చెక్‌ చేసి, అదే తరహా స్పెసిఫికేషన్లతో అవసరమైన సామగ్రికి ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు.
గత సమావేశంలో సూచించిన మేరకు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి, తక్షణ, దీర్ఘకాలిక చర్యలను ప్రతిపాదించాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ ఇన్‌స్పెక్షన్ అనంతరం చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కన్సాలిడేటెడ్ నివేదికను సిద్ధం చేయాలని అన్నారు. జాయింట్ ఇన్‌స్పెక్షన్‌లో చేసిన ప్రతి సిఫార్సుకు సంబంధిత అధికారుల బాధ్యతను నిర్దేశించి, ప్రతిపాదించిన చర్యలను రహదారులపై పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు భద్రతకు సంబంధించి ఇంజినీరింగ్‌ చర్యల్లో భాగంగా రంబుల్‌ స్ట్రిప్స్‌, పాదచారుల క్రాసింగ్‌ మార్కింగ్‌, బ్లింకర్లు, సెంటర్‌, ఎడ్జ్‌ లైన్లు, రోడ్‌ స్టడ్స్‌, అవసరమైన హెచ్చరిక సూచిక బోర్డుల ఏర్పాటును పూర్తి చేయాలని అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలను నిరంతరం కొనసాగించాలని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.
ప్రతి రోడ్డు ప్రాంతంలో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టే ముందు, చర్యలు పూర్తయిన తర్వాత ఫొటోలతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారుల పరిధిలో అవసరమైన అన్ని రోడ్డు భద్రతా చర్యలను సంబంధిత ఎన్‌హెచ్‌ అధికారులు చేపట్టేలా సమన్వయం చేయాలని అన్నారు.
ఎన్‌టీఆర్ సర్కిల్ నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు అవసరమైన రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేసినందున రోడ్డు మార్కింగ్‌ పనులను కూడా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. శ్రీశ్రీ సర్కిల్ వద్ద క్రిస్‌క్రాస్‌గా జరుగుతున్న వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన పనులను అత్యంత సీరియస్‌గా చేపట్టాలని, ఒకరిపై మరొకరు నెపం మోపడం వల్ల సమస్య పరిష్కారం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, జాయింట్ ఇన్‌స్పెక్షన్‌లో గుర్తించిన సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించాలని అన్నారు.

రహదారులపై చేపట్టాల్సిన ప్రతి మార్పు, మెరుగుదల, భద్రతా చర్యలను ముందుగానే కాగితంపై స్పష్టంగా నమోదు చేయాలని అన్నారు. ఏ ప్రాంతంలో ఏ పని ఎందుకు చేపట్టాలి, దానికి అవసరమైన చర్యలు ఏమిటి అనే వివరాలతో ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

ప్రతి జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌కు సంబంధించిన రహదారి వివరాలను, సమస్య ఉన్న ప్రాంతాల ఫొటోలను, గుర్తించిన లోపాలను, అవసరమైన సిఫార్సులను పొందుపరిచి సమగ్ర నివేదికను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కేవలం సమస్యలను గుర్తించడం కాకుండా, వాటికి పరిష్కార మార్గాలను కూడా నివేదికలో స్పష్టంగా సూచించాలని అన్నారు.

ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద అవసరమైన రెండు సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్లకు సంబంధించిన డిజైన్లను తుది రూపంలో సిద్ధం చేసి, పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఎస్‌ఆర్ గార్డెన్స్ పరిసరాల్లో రహదారి భద్రతకు, వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

రోడ్డు భద్రత కోసం కొనుగోలు చేసే అన్ని రకాల సామగ్రి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తక్కువ నాణ్యత కలిగిన సామగ్రి వల్ల రోడ్డు భద్రతా చర్యల ఉద్దేశ్యం నెరవేరదని, కొనుగోలుకు ముందే నాణ్యత, స్పెసిఫికేషన్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు, ఇతర భద్రతా సమస్యలను పోలీసు శాఖ క్షేత్ర స్థాయిలో గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను ప్రతిపాదించాలని కలెక్టర్ సూచించారు. సమస్యలను గుర్తించడం మాత్రమే కాకుండా, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు, కార్యాచరణ ప్రణాళికను సంబంధిత శాఖలకు అందించాలని అన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు పక్కన వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ పార్కింగ్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. బెంగుళూరు, ఇతర నగరాల్లో అమలు చేస్తున్న పార్కింగ్ విధానాలను పరిశీలించి, ఖమ్మం నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. 

నిర్ణయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెలుపల వాహనాలను నిలిపితే వాటిని తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఖమ్మం నగరంలోని షాపింగ్ మాల్స్‌, పెద్ద ఆసుపత్రులు, తదితర వాణిజ్య, ప్రజా వినియోగ సంస్థల్లో తగినంత పార్కింగ్ సదుపాయం ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు.

రోడ్డుపై వాహనాలు నిలిపే పరిస్థితి ఏర్పడకుండా ఆయా సంస్థల యాజమాన్యాలతో సమన్వయం చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం నగరంలో రోడ్‌సైడ్ పార్కింగ్ వల్ల అధిక సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ సమస్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమైన రహదారుల పక్కన రోడ్‌సైడ్ పార్కింగ్ లేకుండా చూడాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు నిలపకుండా అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి రామానుజమ్, ఆర్ అండ్ బి ఎస్ ఈ యుగంధర్ రావు, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. రామారావు, జిల్లా రవాణాధికారి జగదీష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, డిఈఓ సదానందం, ఎన్హెచ్ఏఐ పిడి దివ్య, మునిసిపల్ కమీషనర్ లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.