సొంత నిధులతో మట్టి రోడ్డు పనులకు శ్రీకారం

చౌలపల్లిలో మట్టి రోడ్డు పనులు ప్రారంభించిన రవీందర్ యాదవ్

Published On
సొంత నిధులతో మట్టి రోడ్డు పనులకు శ్రీకారం

IMG-20260903-WA0063( లోకల్ గైడ్ షాద్ నగర్ )

కేశంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందించడంలో ముందుండే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ మరోసారి సేవాభావాన్ని చాటుకున్నారు. కేశంపేట మండలం చౌలపల్లి గ్రామంలోని కోట మైసమ్మ దేవాలయం నుంచి హనుమాన్ దేవాలయం వరకు మట్టి రోడ్డు నిర్మాణ పనులను తన సొంత నిధులతో చేపట్టారు. ఈ మేరకు రోడ్డు పనులను గురువారం గ్రామస్థుల సమక్షంలో ప్రారంభించారు. దేవాలయాలకు వెళ్లే భక్తులతో పాటు గ్రామస్థులు రాకపోకల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు రవీందర్ యాదవ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నర్సింగరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పర్వత్ రెడ్డి, ఎన్ఆర్ఐ నాయకులు గోగు వెంకట నారాయణరెడ్డి, సర్పంచులు హరి శేఖర్, వేణుగోపాల్ చారి, భాస్కర్ నాయక్, రమేష్ యాదవ్, ధనలక్ష్మి రామకృష్ణ, మాజీ సర్పంచులు శ్రీశైలం, వెంకట్ రెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకటేష్ యాదవ్, నవీన్ కుమార్, తిర్మల్రెడ్డి శ్రీనివాస్, బీరప్ప, జగన్, నాయకులు జగన్మోహన్ రెడ్డి, ప్రేమ్ కుమార్ గౌడ్, జమాల్ ఖాన్, సాటు రామకృష్ణ, నాగేష్, రాజశేఖర్, శ్రీను, దర్శన్, జె.శ్రీను, అంజయ్య, చెన్నయ్య, నరసింహా, మహేష్, చంటి, బాబు యాదవ్, యాదగిరి యాదవ్, నరేష్ యాదవ్, కుమ్మరి వెంకటేష్, బి. కృష్ణయ్య, రవి నాయక్, సాజిద్, గోపాల్, బైకని శేఖర్, ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్, కార్తీక్, గోపి రాము, షకీల్, సలీం, కృష్ణ యాదవ్, యాదగిరి, మంగలి మహేష్, రాజు, యాదగిరి, శివ, అసిఫ్, గణేష్ గౌడ్, చుక్క శ్రీను, హరీష్, అనిల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News