వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి

ప్రజలకు విజయాలు యువతకు లక్ష్యసాధన గ్రామాభివృద్ధి సజావుగా సాగాలని ప్రత్యేక పూజలు

Published On
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి

 

 

లోకల్ గైడ్, వికారాబాద్ సెప్టెంబర్ 16 :

 రాజీవ్ గృహకల్ప  20వ వార్డులో దుర్గ మాత సన్నిధిలో కొలువైన విఘ్నేశ్వర స్వామి మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో చాకలి యాదయ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వికారాబాద్ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం భక్తితో విఘ్నేశ్వరునికి నైవేద్యం  చేశారు.ప్రజలు చేపట్టే ప్రతి కార్యక్రమంలో విఘ్నాలు తొలగి, అనుకున్న పనులు విజయవంతంగా పూర్తయ్యేలా విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని చాకలి యాదయ్య దంపతులు ఆకాంక్షించారు. ముఖ్యంగా కాలనిలో యువత విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచి తమ లక్ష్యాలను సాధించేలా స్వామివారు శక్తి, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.అలాగే విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో  అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు మరింత మెరుగుపడాలని యాదయ్య దంపతులు ఆకాంక్షించారు. కాలనీ ప్రజల ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలోపేతం కావాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.ఈ సందర్భంగా మండపం వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామి మండపం నిర్వహణ కమిటీ సభ్యులు కాలనీవాసులు ప్రజలు దేవుని ఆటపాటలతో నృత్యాలు చేశారు

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్