- District News
- ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
జిల్లా కలెక్టర్‌తో కలిసి విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు
---------------------------------------
పెద్దపల్లి, సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )
----------------------------------------
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, డిసిపి రాంరెడ్డి లతో కలిసి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విరాట్ విశ్వకర్మను దైవస్వరూపంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రాచీన కాలం నుంచే విశ్వకర్మలు తమ అద్భుతమైన నైపుణ్యంతో కళలు, వృత్తులు, నిర్మాణ రంగాలకు విశిష్ట సేవలు అందించారని తెలిపారు. వారి నైపుణ్యం, కృషి, సేవలను భావితరాలకు తెలియజేసేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని అన్నారు.
విశ్వకర్మ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వకర్మల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విశ్వకర్మ కుల సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------------------------------------------
