విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బొలెరో ఆటో బోల్తా.. కార్మికుడు మృతి

మరో ఇద్దరికి గాయాలు.. హైదరాబాద్‌కు తరలింపు
Published On
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

 

లోకల్ గైడ్ ఆమనగల్లు, సెప్టెంబర్ 17:
ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠాయిపల్లి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కడ్తాల్ నుంచి ఆమనగల్లు వైపు ఎనిమిది మంది కార్మికులతో బొలెరో ఆటో (టీఎస్‌31 టీ 1044) బయలుదేరింది.IMG-20260917-WA0065

విఠాయిపల్లి వద్ద జాతీయ రహదారి 765పై ఉన్న యూటర్న్‌ వద్దకు చేరుకున్న సమయంలో డ్రైవర్ కోడెల ప్రశాంత్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూ యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేయడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గగన్‌సింగ్‌, విజయ్‌, దేవ్‌సింగ్‌లకు గాయాలయ్యాయి.IMG-20260917-WA0066

గాయపడిన వారిని తొలుత కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న సమయంలో దేవ్‌సింగ్‌ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. గగన్‌సింగ్‌, విజయ్‌లను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.IMG-20260917-WA0064

ఈ ఘటనపై ఆమనగల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్