విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు

సెప్టెంబర్ 17 సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు

Published On
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమల రావు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ స్వేచ్ఛ కోసం పోరాడిన ధీశాలుల త్యాగాల ఫలితంగానే ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నారని తిరుమల రావు పేర్కొన్నారు. నాటి పోరాట యోధుల సాహసం, త్యాగస్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.తెలంగాణ విమోచన కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, వారి త్యాగాలను ప్రజలు ఎల్లప్పుడూ స్మరించుకోవాలని గుడిపూడి తిరుమల రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్