_ప్రజా పార్కుల పరిరక్షణకు హైడ్రాకు ఫిర్యాదు

_స్ప్రింగ్‌ఫీల్డ్ ఎన్‌క్లేవ్ లేఅవుట్‌లో ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలి

_అక్రమ నిర్మాణాలు తొలగించి ప్లాట్ యజమానుల ఆస్తులకు రక్షణ కల్పించాలి. _హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన మెట్టు సూర్య ప్రకాష్
Published On
_ప్రజా పార్కుల పరిరక్షణకు హైడ్రాకు ఫిర్యాదు

 

 

 

 

హైదరాబాద్ ఆగస్టు 13 (లోకల్ గైడ్ ప్రతినిధి)

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 43లో ఉన్న స్ప్రింగ్‌ఫీల్డ్ ఎన్‌క్లేవ్ లేఅవుట్‌లో ప్రజా పార్కులుగా కేటాయించిన స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్‌కు ఫిర్యాదు అందింది.లేఅవుట్‌లో ప్రజా పార్కుల భూముల ఆక్రమణ, అనుమతి లేని నిర్మాణాలు, ప్లాట్ యజమానుల ఆస్తులపై హక్కులు సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తేవాలని ఫిర్యాదుదారు మెట్టు సూర్య ప్రకాష్ కోరారు. ఈ ఫిర్యాదును హైడ్రా కార్యాలయం 07-07-2026న ఇన్‌వర్డ్ నంబర్ 354తో స్వీకరించి నమోదు చేసింది.311.11 చదరపు గజాల స్థలానికి యాజమాన్యంతనకు లేఅవుట్‌లోని ఫ్లాట్ నంబర్ 39లో 311.11 చదరపు గజాల స్థలం ఉందని సూర్య ప్రకాష్ తెలిపారు. డాక్యుమెంట్ నంబర్ 8811/2000 ద్వారా రిజిస్టర్డ్ సేల్ డీడ్‌తో ఆ స్థలానికి తాను యజమానిగా ఉన్నానని, రెండు దశాబ్దాలకు పైగా ఎలాంటి అంతరాయం లేకుండా స్థలాన్ని అనుభవిస్తున్నానని వివరించారు.తన స్థలంలో నిర్మాణానికి సంబంధించి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నుంచి 24-03-2021న పర్మిట్ నంబర్ 3148/W1/2021/004తో అనుమతి పొందినట్లు తెలిపారు. విద్యుత్ మీటర్ కూడా తన పేరుతో ఉన్నట్లు పేర్కొన్నారు.సుమారు రెండు ఎకరాల పార్కు భూమి
మెసర్స్ శాంతా శ్రీరామ్ ఎస్టేట్స్ అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్‌కు అప్పటి హుడా అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేసి పలువురు కొనుగోలుదారులకు ప్లాట్లు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 261 ప్లాట్లు ఉన్న లేఅవుట్‌లో సుమారు 2 నుంచి 3 ప్రజా పార్కులను దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో కేటాయించినట్లు తెలిపారు.ఈ పార్కు స్థలాలు ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములని, వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం లేదా విక్రయించడం జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అక్రమ నిర్మాణాలు, బెదిరింపుల ఆరోపణలుతన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారని సూర్య ప్రకాష్ ఆరోపించారు. తన ఆస్తిపై ఇతరులు హక్కులు ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో తనపై ఒత్తిడి, బెదిరింపులు కూడా జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.గతంలో కూడా ఇదే లేఅవుట్‌లోని తన ఫ్లాట్ నంబర్ 152ను ఒత్తిడి కారణంగా 2018లో విక్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తన ప్లాట్‌కు వెళ్లేమార్గాలనుఆక్రమించడంతో విక్రయించడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని ఆరోపించారు.లేఅవుట్‌కు సంబంధించిన ఆస్తుల విషయంలో డబుల్ రిజిస్ట్రేషన్లు, ఇతర వివాదాలు ఉన్నాయని కూడా ఫిర్యాదుదారు ఆరోపించారు. ప్రజా పార్కులుగా కేటాయించిన స్థలాలను ఇతర సంస్థలకు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలిలేఅవుట్ అనుమతులు, భూమి రికార్డులు, రిజిస్ట్రేషన్లు, పార్కుల స్థలాల వివరాలు, నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని సూర్య ప్రకాష్ హైడ్రాను కోరారు.
విచారణలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఉన్నట్లు తేలితే వాటిని వెంటనే తొలగించాలని, ప్రజా పార్కుల కోసం కేటాయించిన భూములను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానుల ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.
విచారణ పూర్తయ్యే వరకు పార్కు స్థలాలపై ఎలాంటి విక్రయాలు, బదిలీలు, నిర్మాణాలు లేదా ఆక్రమణలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఫిర్యాదుతో పాటు లేఅవుట్ కాపీ, పోలీసు ఫిర్యాదు, సంబంధిత సేల్ డీడ్ల కాపీలు, మున్సిపల్అనుమతిపత్రాలనుహైడ్రాకుసమర్పించినట్లు సూర్య ప్రకాష్ తెలిపారు.ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ ప్రజా పార్కుల భూములను కాపాడటంతో పాటు కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానుల హక్కులను రక్షించేందుకు అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు.వివరాలకు: మెట్టు సూర్య ప్రకాష్ – +91-9000203033

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం