- District News
- Ranga Reddy
- లింగంపల్లిలో ఘనంగా గాంధీ జయంతి గ్రామసభ
లింగంపల్లిలో ఘనంగా గాంధీ జయంతి గ్రామసభ
గ్రామానికి ప్రత్యేక మినీ బస్సు సదుపాయం పంచాయతీరాజ్ కమిషనర్

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లింగంపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రత్యేకంగా చేపట్టిన ఈ సభకు పంచాయతీరాజ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, డీఆర్‌డీఓ, డీపీఓ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు...ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ చేసిన విజ్ఞప్తికి అధికారులు సానుకూలంగా స్పందించారు. గ్రామ ప్రజల రాకపోకలు, రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని లింగంపల్లికి త్వరలోనే ప్రత్యేక మినీ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ ప్రకటించారు. అదేవిధంగా, గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సమగ్రంగా సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదా దిశగా ఈ ప్రాజెక్టు గ్రామ ముఖచిత్రాన్ని మార్చనుందని వారు పేర్కొన్నారు.అనంతరం గ్రామ సర్పంచ్ అమనబోలు సంజీవరెడ్డి మాట్లాడుతూ, లింగంపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు,... ప్రాజెక్టులు కేటాయిస్తున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు......ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ బత్తుల కుమార్, వార్డు సభ్యులు బత్తుల శ్రీనివాస్ రెడ్డి, పంతంగి కృష్ణ, రాచకొండ సురేష్, బత్తుల మమత, శేఖర్ రెడ్డి, పగడాల లావణ్య, దశరథలతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
