- District News
- Ranga Reddy
- అభివృద్ధి అడుగులు... ఆశల వెలుగులు
అభివృద్ధి అడుగులు... ఆశల వెలుగులు
బౌరంపేట్ సమగ్రాభివృద్ధే లక్ష్యం – ప్రజల విశ్వాసంతో ముందుకు ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్
కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 (లోకల్ గైడ్ ప్రతినిధి):
అభివృద్ధే రాజకీయాలకు అసలైన కొలమానం.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధి బాధ్యత" అనే నినాదంతో బౌరంపేట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కే.పీ. వివేకానంద్ నిరంతరం కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన నుంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాల వరకు ప్రతి అంశంలో ప్రత్యేక దృష్టి సారిస్తూ బౌరంపేట్‌ను ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.నియోజకవర్గంలో వేగంగా విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాలు, పార్కులు, కమ్యూనిటీ వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులను ప్రాధాన్యతగా చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రధాన రహదారుల నిర్మాణం, విస్తరణ, ఆధునికీకరణకు పెద్దపీట వేస్తూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు తరచూ బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ స్థానికులతో సమావేశమవుతున్నారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో శాఖల మధ్య సమన్వయం కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.బౌరంపేట్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా నిధులను సమీకరించడంతో పాటు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించి అమలుదిశగాముందుకుతీసుకెళ్తున్నారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరాలనే లక్ష్యంతో ప్రజా అవసరాలకు అనుగుణంగాపనులనుప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు.ప్రజల విశ్వాసమే తనకు అతిపెద్ద బలమని ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ పేర్కొంటూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి మార్గంలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమిస్తూ బౌరంపేట్‌ను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.అభివృద్ధి అడుగులతో ఆశల వెలుగులు నింపుతూ, ప్రజల భాగస్వామ్యంతో బౌరంపేట్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ ముందుకు సాగుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సేవల మెరుగుదల, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలతో బౌరంపేట్ ప్రాంతం కొత్త రూపు సంతరించుకుంటోందని వారు అభిప్రాయపడుతున్నారు.
