- District News
- నారాయణపేట చేనేతకు దేశ, విదేశాల్లో విశేష ఆదరణ చేనేత సంప్రదాయాన్ని భావితరాలకుఅందించాలి.
నారాయణపేట చేనేతకు దేశ, విదేశాల్లో విశేష ఆదరణ చేనేత సంప్రదాయాన్ని భావితరాలకుఅందించాలి.
యువత ఆధునిక మార్కెటింగ్,ఈ-కామర్స్ అవకాశాలనుసద్వినియోగం చేసుకోవాలి.
నారాయణపేట ఆగస్టు 7:
నారాయణపేట జిల్లా అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జీఐ ట్యాగ్ కలిగిన నారాయణపేట చేనేత చీర లేనని జిల్లా కలెక్టర్ ప్రియాం క అన్నారు. చేనేత వృత్తి జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఈ గొప్ప సంప్రదాయాన్ని భావిత రాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొ న్నారు.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించు కుని నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని చేనేత కార్మికులకు శుభా కాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తాను బాధ్యతలు స్వీకరిం చిన అనంతరం నారాయ ణపేట, కోటకొండ, జాజా పూర్ తదితర ప్రాంతాల్లోని చేనేత కుటుంబాలను సంద ర్శించి వారి పనితీరును స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల ప్రతిభ, నైపుణ్యం అభినం దనీయమని, వారు తయా రు చేసిన చీరలను తాను కూడా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.చేనేత రంగా నికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అండగా ఉంటుం దని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం చేనేత రంగం పలు సవాళ్లనుఎదుర్కొంటున్నప్పటికీ, నారాయణపేట చేనేత ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో విశేష ఆదరణ ఉందన్నారు.ఇండోనేషియా, మలేషియా తదితర దేశా ల నుంచి ఆన్‌లైన్ ద్వారా నారాయణపేట చీరలకు ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు.ఈ అవకాశా లను మరింత విస్తరించేం దుకు మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికలను సమర్థవంతంగా వినియో గించుకోవాలనిసూచించారు.చేనేత కుటుంబాల యువతను గుర్తించి వెబ్ సైట్ నిర్వహణ, ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా మార్కె టింగ్, డిజిటల్ విక్రయాలపై ప్రత్యేక శిక్షణ అందించేం దుకు చర్యలు చేపడుతు న్నట్లు తెలిపారు. ఇందు కోసం హైదరాబాద్, మధురై తదితర ప్రాంతాలకు శిక్షణ కోసం పంపించే ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడిం చారు.

మహిళా సంఘాల ద్వారా ఉత్తమ చేనేత ఉత్పత్తు లను ఎంపిక చేసి ఆన్‌లైన్ విక్రయాలకు ప్రోత్సహించ నున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో చేనేత కార్మికులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుం టామని చెప్పారు.
ఆధునిక చేనేత కేంద్రం త్వరలో ప్రారంభం
నారాయణపేటలో ఏర్పా టు చేసిన ఆధునిక చేనేత కేంద్రంలో మగ్గాలు, కుట్టు యంత్రాలు, డైయింగ్ యూనిట్లు ఇప్పటికే సిద్ధం గా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించి టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించను న్నట్లు పేర్కొన్నారు. మహి ళా సంఘాల భాగస్వా మ్యంతో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి చేనేత ఉత్ప త్తులకు మరింత విస్తృత మార్కెట్ కల్పిస్తామని తెలిపారు.జీఐ ట్యాగ్‌తో నారాయణపేట చేనేతకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించిందని పేర్కొంటూ, ఈ వారసత్వా న్ని భావితరాలకు అందిం చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. దేశ, విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ ద్వారా విక్రయాలను విస్తరించాలని సూచిం చారు. చేనేత కుటుంబాల యువతకు ప్రత్యేక శిక్షణతో పాటు మహిళా సంఘాల భాగస్వామ్యంతో మార్కె టింగ్ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ప్రభు త్వ పాఠశాలల విద్యార్థి నులకు జిల్లా కలెక్టర్ బహు మతులు అందజేశారు. అలాగే పలువురు సీనియర్ చేనేత కార్మికులను శాలు వాలతో సన్మానించి వారి సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌డీ ఏ పీడీ వెంకట్ రాములు, మున్సిపల్ చైర్‌పర్సన్ కొండా శ్వేతా సత్య యాద వ్, వైస్ చైర్‌పర్సన్ మంజు ల, చేనేత జౌళి శాఖ సహా య సంచాలకులు ద్వారక్, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మహి ళా సంఘాల సభ్యులు, చేనేత కార్మికులు, యువత పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.చేనేత కార్మికుగాలిని సన్మానించిన కలెక్టర్,3.బహుమతులు అందజేసిన కలెక్టర్,3.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రియాంక
------------------------------------
