అందరి సహకారంతో నే  బాల్య వివాహాల నిర్మూలన

జిల్లా కలెక్టర్ ప్రియాంక.

Published On
అందరి సహకారంతో నే  బాల్య వివాహాల నిర్మూలన

నారాయణపేట మే 30:

అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని అందరి కృషితో
నారాయణ పేట ను  బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. బాలికల చదువుతోనే బాల్య వివాహా లను నిర్మూలించడం సాధ్యం అవుతుందన్నారు.  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన  సంస్థ ఆధ్వర్యంలో  వయోజన విద్య అమ్మకు అక్షర మాల, స్నేహ సంఘాల ద్వారా మాక్  పార్ల మెంట్ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తో  కలిసి కలెక్టర్ హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  కిశోర బాలికల సంఘాలను ఏర్పా టు చేయడం జరిగింద న్నారు.  బాలికలు ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని సూచించారు. ఈ సారి పది ఫలితాలలో జిల్లా లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు  అమ్మా యిలే కావడం గర్వించదగ్గ విషయం అన్నారు.  ఎప్పు డూ  పది ఫలితాల్లో బాలి కలదే హావా అని  చూస్తుం టాం కానీ ఉద్యోగాలలో మాత్రం బాలికలు వెనకబడి పోతారని,  పదో తరగతి తర్వాత ఆరేళ్ల లో బాలికలు తీసుకునే నిర్ణయాలతో  భవిష్యత్తును మార్చుకోవ ద్దని తెలిపారు.  రేపు  జరగ బోయే దాని గురించి  ఈ రోజు ఆలోచించ వద్దన్నారు.  అమ్మకు అక్షర మాల ద్వారా వయోజనులకు చదువు చెప్పే వీ వో లకు ఈ సంద ర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మహిళా అక్షరాస్యత పెరగాలని ఆమె సూచించారు.  జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ  జిల్లా లో బాల్య వివాహాల నిర్మూలన కు  మిషన్ మోడ్ లో పనిచేయాలన్నారు.  ప్రభుత్వ శాఖల నుంచి సహకారం ఉంటుందని చెప్పారు.  బాలికలు తమ కోసం తాము ఫైట్ చేయా లని, తమ తోటి స్నేహితు రాలి కోసం కూడా ఫైట్ చేయాలన్నారు. మహిళలు చదువుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.  కాగా అంతకు ముందు   బాల్య వివాహాల నిరోధక చట్టం పై   మాక్ పార్ల మెంట్  నిర్వహించిన కిశోర బాలి కలను జిల్లా కలెక్టర్,ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.  విధుల నిర్వహణ లో ఉత్తమ ప్రతిభ చాటిన సి సి లు, సిబ్బందికి కలెక్టర్, ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజే శారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ వెంకట్ రాములు, జెడ్పీ సీ ఈ వో శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయ చంద్ర మోహన్, డీ ఈ ఓ గోవింద రాజులు,  డీ పీఎం, ఏ పీ ఎం లు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:7.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ 
---------------------------------------

Tags:

About The Author

Latest News