- District News
- సరస్వతి రూపంలో భవానీ మాత దర్శనం.
సరస్వతి రూపంలో భవానీ మాత దర్శనం.
బసవన్న కట్టలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. - ముఖ్య అతిథిగా హాజరై మొక్కులు చెల్లించుకున్న పీఎస్‌సీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్
లోకల్ గైడ్/తాండూరు:
తాండూరు పట్టణంలోని బసవన్న కట్ట వద్ద భవానీ మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాలాల్ మండల పీఎస్‌సీఎస్ చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్ హాజరై భవానీ మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.
ఈ సందర్భంగా చైర్మన్ భీమ్‌శెట్టి అనిల్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని భవానీ మాతను ప్రార్థించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు మంచి జరగాలని, గ్రామాలు, పట్టణాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంతో పాటు ఐక్యతను చాటుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోటం మురళీకృష్ణ, నగరేశ్వర దేవస్థానం చైర్మన్ భాను కుమార్, మాజీ చైర్మన్ రాధాపురం దాదాపురం సతీష్, లింగదల్లి రవికుమార్, పునీత్, చందు, తదితరులు పాల్గొన్నారు.
