పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: 

వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

Published On
పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: 

 

 

 లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి :
 
ప్రకృతిలో లభించే పూలనే దేవతగా ఆరాధించే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక "బతుకమ్మ పండుగ" అని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు.
శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహరా, ట్రైనీ కలెక్టర్ సచిన్ బసవరాజ్ కలిసి పాల్గొని, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ సంబరాలను ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, పూల వైవిధ్యానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మహిళల విశేష భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ వేడుకలు సాంస్కృతిక ఐక్యతను, సామాజిక సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కాంతారావు, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో ) జయసుధ, జిల్లా పౌర సంబంధాల అధికారి ( డిపిఆర్ఓ) చెన్నమ్మ, సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా ఉద్యోగులు మరియు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్