50 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ.

మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం.

Published On
50 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ.

లోకల్ గైడ్/ తాండూర్:
 పెద్దేముల్ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం–ఎంఏఎన్‌పీ పథకం కింద రైతులకు 50 శాతం రాయితీపై మంగళవారం కంది, మినుము, పెసర విత్తనాలను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం వెల్లడించారు.
ఈ సందర్భంగా తాండూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు అరుణ మాట్లాడుతూ...ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు రబీ సాగును చేపట్టి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరి, చెరకు, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా కంది, మినుము, పెసర, రాగి, జొన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ 
కార్యక్రమంలో పెద్దేముల్ గ్రామ సర్పంచ్, వ్యవసాయ విస్తరణ అధికారులు దేవేందర్, చంద్రకళ, శ్రవణ్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...