చర్లలో ఆలయ భూముల పరిరక్షణకు శివాలయం కమిటీ మద్దతు

జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలి

Published On
చర్లలో ఆలయ భూముల పరిరక్షణకు శివాలయం కమిటీ మద్దతు


చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
చర్ల మండల కేంద్రంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట శ్రీశ్రీశ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ భూములను ఆక్రమణదారుల చెర నుంచి విడిపించి ఆలయ కమిటీకి అప్పగించాలని మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చర్ల శివాలయం ఆలయ కమిటీ సభ్యులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆలయ భూముల సమస్యపై తహసీల్దార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా శివాలయం ఆలయ కమిటీ దైవ ప్రధాన సేవకులు జవ్వాది రవి మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా ఈ స్థలాన్ని ఆలయ కమిటీ పరిరక్షిస్తూ వస్తోందని తెలిపారు. ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు ఆలయ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. గతంలో పలుమార్లు వినతిపత్రాలు సమర్పించగా, అప్పటి తహసీల్దార్ ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి, స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, అనంతరం ఆక్రమణదారులు తిరిగి వచ్చి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి నివాసం ఉంటున్నారని తెలిపారు. సమస్యపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోకుండా నోటీసులు, బోర్ల ప్రస్తావనతో కాలయాపన చేయడం సరికాదన్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఆలయ భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యులను పూజలు నిర్వహించకుండా ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆలయ భూముల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, సమస్యను పూర్తిస్థాయిలో విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జవ్వాది రవి డిమాండ్ చేశారు. దేవాలయ భూములు కేవలం ఆస్తి మాత్రమే కాదని, భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక భావోద్వేగాలకు సంబంధించినవని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, ఆలయ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆక్రమణలు నిజమని తేలితే భూమిని స్వాధీనం చేసుకుని ఆలయ కమిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆలయ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివాలయం ఆలయ కమిటీ సేవకులు పెందుర్తి ఆంజనేయులు, సిద్ధాంతి శ్రీను, నీలి ప్రసాద్, శ్యాం, గూడూరి కృష్ణమూర్తి, సత్యనారాయణ, సుజాత, కుమారు, కిషోర్, రాజేష్, ప్రమోద్, భాష, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...