శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 

హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి: సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ మండల కార్యదర్శి గుమ్మడి సందీప్

Published On
శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 

 

 

కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే శిరీషను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరీష హత్యకు పాల్పడిన నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

టేకులగూడెం గ్రామంలో మాస్‌లైన్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గొగ్గల రాము ఆధ్వర్యంలో మహిళలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మడి సందీప్ మాట్లాడుతూ.. ఆదివాసీ బిడ్డ శిరీషను అతి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి, ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని అన్నారు. ఆదివాసీ సమాజానికి చెందిన అమాయక యువతి ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు పెరుగుతున్నాయని, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నప్పటికీ వారి ప్రాణాలు, గౌరవం, భద్రతకు తగిన రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు.

బాధిత శిరీష కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 10 ఎకరాల సాగుభూమి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. శిరీష కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బిక్కసాని భాస్కరరావు, వార్డు సభ్యులు దోమల సీత, కోడెం రమణ, గ్రామ పెద్దలు గుమ్మడి ఎర్రయ్య, రామారావు, కోడెం సీతారాములు, జోగా రవి, స్వర్ణభాక అనసూయ, దోమల సుజాత, దోమల కోటమ్మ, మోకాళ్ల కోటమ్మ, గుగ్గల ఉమాదేవి, గుమ్మడి శిరీషతో పాటు అధిక సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...