- District News
- జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ.
జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ.
క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి.
లోకల్ గైడ్/బంట్వారం:
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని బంట్వారం గ్రామ సర్పంచ్ డి. మల్లేశం అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేశం మాట్లాడుతూ... విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని అన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన అలవర్చుకుని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనతో పాటు వారి విద్యాభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూనిఫాంల పంపిణీతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
