భక్తిశ్రద్ధలతో గణనాథుడి ప్రతిష్ఠాపన.

యశోదానగర్‌లో భగత్‌సింగ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.

మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి: -  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
Published On
భక్తిశ్రద్ధలతో గణనాథుడి ప్రతిష్ఠాపన.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని యశోదానగర్ 28వ వార్డులో భగత్‌సింగ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి పూజలు నిర్వహించి విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులు తాండూర్ పట్టణ ప్రజలపై, హిందూ ఉత్సవ సమితి సభ్యులపై, యావత్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించారు.
అదేవిధంగా వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావాలతో నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యావంతులు శరత్ చంద్ర, కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, విజయ్ పటేల్, భగత్‌సింగ్ వినాయక ఉత్సవ కమిటీ యశోద నగర్ అధ్యక్షులు జి.పవన్, కార్యదర్శి శ్యామ్, అజయ్ గౌడ్, మల్లేష్,హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News