- District News
- _తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా డా. చెంబెటి మృత్యుంజయరావు
_తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా డా. చెంబెటి మృత్యుంజయరావు
_బీసీల హక్కులు, సంక్షేమం కోసం మరింత క్రియాశీలకంగా పనిచేస్తా: డా. మృత్యుంజయరావు
కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 14 (లోకల్ గైడ్ ప్రతినిధి)
జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చెంబెటి మృత్యుంజయరావును నియమించింది. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సెప్టెంబర్ 13న నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణలో బీసీల సంక్షేమం, హక్కులు, సామాజిక న్యాయం కోసం డా. చెంబెటి మృత్యుంజయరావు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆకాంక్షించింది. రాష్ట్రంలోని బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కుల సాధనకు కృషి చేయాల్సిన బాధ్యతను ఆయనపై ఉంచింది.
ఈ సందర్భంగా డా. చెంబెటి మృత్యుంజయరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్. కృష్ణయ్య జన్మదినం సందర్భంగా తనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ఎంతో ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.తెలంగాణలో బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని డా. మృత్యుంజయరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసి, బీసీల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ బీసీల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. బీసీ సంఘాలు, నాయకులు,కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సంఘాన్ని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య కుమారుడు డా. ర్యాగ అరుణ్ కుమార్
వర్కింగ్ ప్రెసిడెంట్. నేషనల్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్,పాటుపలువురుబిసిసంఘాలనాయకులు,ప్రతినిధులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లోడా.మృత్యుంజయరావు విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు
