- District News
- Ranga Reddy
- గణేష్ ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి
గణేష్ ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చేయని నిర్వాహకులు వెంటనే ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలి
లోకల్ గైడ్ ఆమనగల్లు, సెప్టెంబర్ 14:
ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠాపించనున్న ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన స్థలం, నిర్వాహకుల వివరాలు తదితర సమాచారాన్ని ఆన్‌లైన్ లో నమోదు చేసి అనుమతి ప్రక్రియను పూర్తి చేయాలని పోలీసులు సూచించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని నిర్వాహకులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్:
policeportal.tspolice.gov.in
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆమనగల్లు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రతి మండపం నిర్వాహకుడు సకాలంలో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు.
