- District News
- Ranga Reddy
- పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు.
పూజలు లేకుండానే నేరుగా గంగమ్మ ఒడికి గణేశుడు.
పీర్జాపూర్ గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదం. ఆలయంలో గణేష్ ప్రతిష్ట జరగకూడదని ఓ వర్గం... వద్దని మరో వర్గం.
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 14 (లోకల్ గైడ్ ):
షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలం పీర్జాపూర్ గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో గణేష్ విగ్రహా ప్రతిష్టాప రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు గ్రామస్తులు భావించారు. అయితే మరో వర్గం వారు ఇది ఒప్పుకోకుండా తాము ఏర్పాటు చేసిన గణేశుడే ఉండాలన్న పట్టుదలతో ఇరువర్గాల మధ్య ఏర్పడిన మనస్పర్దాలు వివాడానికి దారితీసింది. గ్రామంలో జరుగుతున్న ఈ వివాదం ఘర్షణలకు తావివ్వకుండా జిల్లేడు చౌదరిగూడెం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆలయంలో ఎవరు గణేష్ విగ్రహాన్ని పెట్టకుండా వేరేచోట పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో మరో వర్గం చేసేది లేక తీవ్ర అసంతృప్తితో గణేశుడిని గ్రామ చెరువులో కాసేపటికే నిమజ్జనం చేశారు.
పీర్జాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాములు తిరుపతి సంగమేష్ కురువ మల్లయ్య కురువరాముడు రమేష్ బందయ్య సాకలి అంజయ్య నలగంటి దశరథం బోనంపాటి చెన్నయ్య తదితరులు గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో వినాయక ఉత్సవాలను నిర్వహించేందుకు కొంతమంది గ్రామస్తులు సహకారంతో విగ్రహాన్ని తీసుకువచ్చారు. వినాయక చవితి రోజున సదరు విగ్రహాన్ని గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టించేందుకు పునుకొన్నారు. అయితే గ్రామ సర్పంచ్ ఎర్రగుమ్ము నర్సింలు, అదేవిధంగా తుమ్మకింది మల్లేష్ కొండయ్యల, కొండయ్యల రమేష్, కొండయ్యల కృష్ణయ్య, సాలె యాదయ్య, కొండయ్యల బుచ్చయ్య, సాలె రవి, అభవతి శేఖర్, బాలయాల నరసింహులు తదితరులు ఆంజనేయస్వామి దేవాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని మరో చోట ఎక్కడైనా పెట్టుకోవాలని సూచించడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది.
పోలీసుల రంగ ప్రవేశంతో సద్దు మణిగిన ఘర్షణ...
గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ నవరాత్రులు జరపడానికి రెండు వర్గాలు వివాదానికి దిగుతున్నాయన్న సమాచారం అందుకొని పోలీసులు గ్రామంలో రంగ ప్రవేశం చేశారు. గ్రామంలో పండుగ వేళ ఎలాంటి వివాదాలు ఘర్షణలు చేయకుండా ఆలయంలో ఏ వర్గం విగ్రహాన్ని పెట్టకుండా ఇతర చోట్లలో పెట్టుకోవాలని ఆదేశించారు. పోలీసుల ఆదేశాలు శిరసా వహించిన గ్రామస్తులు సర్పంచ్ వర్గం గ్రామంలో పోచోట వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకోగా తీవ్ర అసంతృప్తికి గురైన మరో వర్గం వినాయకుడిని నేరుగా గంగమ్మ గుడి కి తీసుకువెళ్లారు. వినాయకుడిని ఎలాంటి పూజలు నిర్వహించకుండా నవరాత్రులు జరపకుండా గ్రామ చెరువులో నిమజ్జనం చేయడంపై పలువురు గ్రామస్తులు నిరుత్సాహానికి గురయ్యారు.
